శేరిలింగంపల్లి, ( గచ్చిబౌలి ), జూన్ 23 : శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి తండా లో గల పెద్ద చెరువులోకి భారీగా చేరిన కాలుష్యంతో ఆక్సిజన్ అందక చేపలు చనిపోయిన విషయం తెలుసుకున్న గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి చెరువు ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామం నుంచి వెలువడే కలుషిత నీరు నేరుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ద్వారా చెరువులోకి రావడంతో చేపలు మృతి చెందాయని భావించారు. కలుషిత నీరు చేరకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని వాపోయారు. మత్స్యకారులకు న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రంగస్వామి, నగేష్, విక్రమ్, రంగస్వామి, రంగస్వామి, వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.