Thursday, November 14, 2024
HomeSportsPRO KABADDIపుణెరి పల్టన్‌ చేతిలో గుజరాత్‌ జెయింట్స్‌ చిత్తు

పుణెరి పల్టన్‌ చేతిలో గుజరాత్‌ జెయింట్స్‌ చిత్తు

ఎదురులేని పుణెరి పల్టన్‌

గుజరాత్‌ జెయింట్స్‌పై 49-30తో ఘన విజయం 

ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌ 11

హైదరాబాద్‌, న్యూస్ టుడే, నవంబర్‌ 04 : డిఫెండింగ్‌ చాంపియన్‌ పుణెరి పల్టన్‌ టాప్‌ లేపింది. ప్రొ కబడ్డీ లీగ్‌ 11వ సీజన్‌లో ఐదో విజయం ఖాతాలో వేసుకున్న పుణెరి పల్టన్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానం మరింత పదిలం చేసుకుంది. సోమవారం గచ్చిబౌలిలోని జిఎంసి బాలయోగి ఇండోర్‌ స్టేడియంలో జరిగిన పీకెఎల్‌ 11 లీగ్‌ దశ మ్యాచ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌పై 49-30తో పుణెరి పల్టన్‌ ఏకపక్ష విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో కీలక ఆటగాళ్లు విశ్రాంతి తీసుకున్నప్పటికీ సమిష్టిగా మెరిసిన పుణెరి పల్టన్‌ 19 పాయింట్ల తేడాతో గుజరాత్‌ జెయింట్స్‌ను చిత్తు చేయటం విశేషం. పుణెరి పల్టన్‌ ఆటగాళ్లలో ఆకాశ్‌ షిండె (11 పాయింట్లు) సూపర్‌ టెన్‌తో మెరువగా.. పంకజ్‌ మోహితె (8 పాయింట్లు), మోహిత్ గోయత్‌ ( 5 పాయింట్లు), ఆమన్‌ ( 5 పాయింట్లు), గౌరవ్‌ ఖత్రి ( 5 పాయింట్లు) అదరగొట్టారు. గుజరాత్‌ జెయింట్స్‌ తరఫున గుమన్‌ సింగ్‌ ( 13 పాయింట్లు) సూపర్‌ టెన్‌ ప్రదర్శనతో ఒంటరి పోరాటం చేశాడు. పుణెరి పల్టన్‌ ఏడు మ్యాచుల్లో ఐదో విజయం సాధించగా, గుజరాత్‌ జెయింట్స్‌ ఐదు మ్యాచుల్లో నాల్గో పరాజయం చవిచూసింది.

పల్టన్‌ వన్‌సైడ్‌ షో…

వరుస విజయాల జోరుమీదున్న డిఫెండింగ్‌ చాంపియన్‌ పుణెరి పల్టన్‌.. గుజరాత్‌ జెయింట్స్‌పై పంజా విసిరింది. ప్రథమార్థంలోనే ఆ జట్టుపై ఏకంగా 21 పాయింట్ల భారీ ఆధిక్యం సాధించింది. ప్రథమార్థం తొలి ఐదు నిమిషాల్లో, చివరి ఐదు నిమిషాల ఆటలో గుజరాత్‌ జెయింట్స్‌ను ఆలౌట్‌ చేసిన పుణెరి పల్టన్‌ 30-9తో వన్‌సైడ్‌ షో చేసింది. కెప్టెన్‌ అస్లాం ఇనందార్‌ బరిలో లేకపోయినా.. ఆకాశ్‌ షిండే, పంకజ్‌ మోహితె, మోహిత్‌ గోయత్‌లు కూతలో కేక పెట్టించారు. పంకజ్‌ మోహితె, మోహిత్‌ గోయత్‌లు కండ్లుచెదిరే సూపర్‌ రెయిడ్లతో ఆకట్టుకున్నారు. డిఫెన్స్‌లో గౌరవ్‌ ఖత్రి, ఆమన్‌ ట్యాకిల్స్‌ జెయింట్స్‌ను మరింత ఒత్తిడిలోకి నెట్టాయి. తొలి పది నిమిషాల్లో 14-5తో ముందంజ వేసిన పుణెరి పల్టన్‌.. తర్వాతి పది నిమిషాల్లో రెట్టించిన ఉత్సాహంతో పాయింట్లు సాధించింది. గుజరాత్‌ జెయింట్స్‌ పూర్తిగా తేలిపోయింది. గుమన్‌ సింగ్‌ కూతలో మెరిసినా.. ఇతర ఆటగాళ్లు దారుణంగా నిరాశపరిచారు.

గుజరాత్‌ పుంజుకున్నా.. పుణెరి అదే జోరు…

విరామం అనంతరం సైతం పుణెరి పల్టన్‌ జోరు తగ్గలేదు. గుజరాత్‌ జెయింట్స్‌ ఆట కాస్త మెరుగైనా.. పుణెరి పల్టన్‌కు పోటీ ఇచ్చే స్థాయిలో రాణించలేదు. ద్వితీయార్థం తొలి పది నిమిషాల తర్వాత పుణెరి పల్టన్‌ 41-16తో 25 పాయింట్ల ఆధిక్యం దక్కించుకుంది. క్రమం తప్పకుండా పాయింట్లు సాధించిన గుజరాత్‌ జెయింట్స్‌ ఆఖరు ఐదు నిమిషాల ఆట మిగిలి ఉండగా పుణెరి పల్టన్‌ను ఆలౌట్‌ చేసింది. పాయింట్ల అంతరం తగ్గించేందుకు చివరి ఐదు నిమిషాల్లో మంచి ప్రయత్నమే చేసింది. అయినా, పుణెరి పల్టన్‌ అలవోకగా సీజన్లో ఐదో విజయం సాధించింది. ద్వితీయార్థంలో పుణెరి పల్టన్‌ 19 పాయింట్లు సాధించగా, గుజరాత్‌ జెయింట్స్‌ 21 పాయింట్లు దక్కించుకుంది.

Admin
Adminhttps://thenewstoday.online/
నమస్తే..! TheNewsToday....న్యూస్ తెలుగు స్వాగతం. Website నుంచి మీకు నచ్చే మీరు మెచ్చే మంచి కథనాలను మీకు అందిస్తాం. స్పూర్తిదాయకమైనవి, ఆశ్చర్యపరిచేవి, ఔరా అనిపించేవి, ఇంకా ఎన్నెన్నో రకాల వీడియోలను మీరిక్కడ చూడొచ్చు. మా చానెల్ గురించి మీరేం అనుకుంటున్నారో తెలపండి. మీకు ఎలాంటి సమాచారం కావాలో, ఎలాంటి వీడియోలు కావాలో చెపుతూ కామెంట్ చేయండి. నచ్చిన వీడియోలు షేర్ చేయండి. కామెంట్ చేసేటప్పుడు దయచేసి కొన్ని పద్ధతులు పాటించండి. ఇతరుల గురించి వ్యాఖ్యానించేప్పుడు కనీస మర్యాద పాటించండి. పోస్టుకు సంబంధం లేని వ్యాఖ్యలు చేయకండి..
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments