Friday, December 20, 2024
HomeSportsPRO KABADDIహర్యానా స్టీలర్స్‌ పై బెంగాల్‌ వారియర్స్‌ విజయం

హర్యానా స్టీలర్స్‌ పై బెంగాల్‌ వారియర్స్‌ విజయం

*మణిందర్‌ సింగ్‌ సూపర్‌ టెన్‌ జోరు 

*హర్యానా స్టీలర్స్‌పై 40-38తో బెంగాల్‌ వారియర్స్‌ గెలుపు

*ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌ 11 

హైదరాబాద్‌, న్యూస్ టుడే, నవంబర్‌ 03 : బెంగాల్‌ వారియర్స్‌ వరుస టైలకు ముగింపు పలుకుతూ మళ్లీ గెలుపు బాట పట్టింది. చివరి రెండు మ్యాచుల్లో ‘టై’ ఎదురుకాగా ఆదివారం గచ్చిబౌలిలోని జిఎంసి బాలయోగి ఇండోర్‌ స్టేడియంలో జరిగిన ప్రొ కబడ్డీ లీగ్‌ 11వ సీజన్‌ మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్‌పై 40-38తో బెంగాల్‌ వారియర్స్‌ మెరుపు విజయం సాధించింది.

ఆరంభంలో వెనుకంజ వేసినా.. రెయిడర్‌ మణిందర్‌ సింగ్‌ (12 పాయంట్లు) సూపర్‌ టెన్‌ షోతో బెంగాల్‌ వారియర్స్‌ దూకుడు పెంచింది. వారియర్స్‌ తరఫున సుశీల్‌ (4 పాయింట్లు), ప్రవీణ్‌ కుమార్‌ (4 పాయింట్లు), ఫజల్‌ (4 పాయింట్లు) రాణించారు. హర్యానా స్టీలర్స్‌ రెడియర్‌ వినయ్‌ (10 పాయింట్లు) సూపర్‌ టెన్‌తో మెరువగా.. ఆల్‌రౌండర్‌ మహ్మద్‌ రెజా (9 పాయింట్లు), నవీన్‌ (6 పాయింట్లు) ఆకట్టుకున్నారు. బెంగాల్‌ వారియర్స్‌కు పీకెఎల్‌ 11లో ఇది ఐదు మ్యాచుల్లో రెండో విజయం. హర్యానా స్టీలర్స్‌కు ఇది ఐదు మ్యాచుల్లో రెండో పరాజయం.

ప్రథమార్థం నువ్వా నేనా…

బెంగాల్‌ వారియర్స్‌, హర్యానా స్టీలర్స్‌ మ్యాచ్‌ ఆరంభం నుంచి ఉత్కంఠగా సాగింది. గత సీజన్‌ రన్నరప్‌ హర్యానా స్టీలర్స్‌ ఆధిక్యంలో నిలిచేందుకు ఎంతో సమయం తీసుకోలేదు. రెయిడర్లకు డిఫెండర్లు సైతం తోడవగా వేగంగా పాయింట్లు సాధించింది. ప్రథమార్థంలో ఎక్కువ భాగం ముందంజలో నిలిచింది. చివర్లో పుంజుకున్న బెంగాల్‌ వారియర్స్‌ స్కోరు సమం చేసింది. హర్యానా స్టీలర్స్‌ను ఓ సారి ఆలౌట్‌ చేసింది.

దీంతో 20 నిమిషాల ఆట అనంతరం బెంగాల్‌ వారియర్స్‌, హర్యానా స్టీలర్స్‌ 19-19తో సమవుజ్జీలుగా నిలిచాయి. రెయిడింగ్‌లో బెంగాల్‌ వారియర్స్‌ 10 పాయింట్లు సాధించగా, హర్యానా స్టీలర్స్‌ 12 పాయింట్లు నెగ్గింది. డిఫెన్స్‌లో బెంగాల్‌ వారియర్స్‌ 4 పాయింట్లు సాధించగా, హర్యానా స్టీలర్స్‌ 5 పాయింట్లు దక్కించుకుంది.

వారియర్స్‌ దూకుడు…

విరామం అనతరం బెంగాల్‌ వారియర్స్ దూకుడు పెంచింది. ప్రథమార్థంలో నెమ్మదిగా పుంజుకున్న బెంగాల్‌ వారియర్స్‌.. ద్వితీయార్థంలో రెచ్చిపోయింది. రెయిడర్లు మణిందర్‌ సింగ్‌, సుశీల్‌లు మెరిశారు. డిఫెండర్‌ ఫజల్‌ సైతం కీలక ట్యాకిల్స్‌తో ఆకట్టుకున్నాడు. దీంతో సెకండ్‌ హాఫ్‌లో బెంగాల్‌ వారియర్స్‌ ఆధిక్యంలోనే నిలిచింది.

చివరి ఐదు నిమిషాల ఆటలో హర్యానా స్టీలర్స్‌ రేసులోకి వచ్చేందుకు గట్టి ప్రయత్నం చేసింది. పాయింట్ల అంతరాన్ని 31-33తో కుదించింది. కానీ ఈ సమయంలో మరోసారి స్టీలర్స్‌ను ఆలౌట్‌ చేసిన వారియర్స్‌.. ఆధిక్యం రెట్టింపు చేసుకుంది. ఆఖరు వరకు పోటీనిచ్చిన హర్యానా స్టీలర్స్‌ 37-39తో వారియర్స్‌ను వెంబడించింది. చివరి కూతలో వారియర్స్‌ రెయిడర్‌ అవుటైనా.. 40-38తో పైచేయి నిలుపుకుంది.

Admin
Adminhttps://thenewstoday.online/
నమస్తే..! TheNewsToday....న్యూస్ తెలుగు స్వాగతం. Website నుంచి మీకు నచ్చే మీరు మెచ్చే మంచి కథనాలను మీకు అందిస్తాం. స్పూర్తిదాయకమైనవి, ఆశ్చర్యపరిచేవి, ఔరా అనిపించేవి, ఇంకా ఎన్నెన్నో రకాల వీడియోలను మీరిక్కడ చూడొచ్చు. మా చానెల్ గురించి మీరేం అనుకుంటున్నారో తెలపండి. మీకు ఎలాంటి సమాచారం కావాలో, ఎలాంటి వీడియోలు కావాలో చెపుతూ కామెంట్ చేయండి. నచ్చిన వీడియోలు షేర్ చేయండి. కామెంట్ చేసేటప్పుడు దయచేసి కొన్ని పద్ధతులు పాటించండి. ఇతరుల గురించి వ్యాఖ్యానించేప్పుడు కనీస మర్యాద పాటించండి. పోస్టుకు సంబంధం లేని వ్యాఖ్యలు చేయకండి..
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments