హైదరాబాద్, న్యూస్ టుడే 27 : నార్సింగి పోలీసులు స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్‌ఓటీ), ఎక్సైజ్ శాఖ అధికారుల సహకారంతో హైదరాబాద్ శివార్లలోని ఓ ఫామ్‌హౌస్‌పై అక్టోబర్ 27 తెల్లవారుజామున దాడులు నిర్వహించారు.
ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ నుండి అవసరమైన అనుమతులు లేకుండా జన్వాడలో మద్యం అందిస్తున్నట్లు సమాచారం అందుకున్న అధికారులు.
ఫామ్‌హౌస్‌లో సోదాల వివరాలు పోలీసుల కథనం ప్రకారం.. పార్టీకి 21 మంది పురుషులు, 14 మంది మహిళలు హాజరయ్యారు. పబ్లిక్ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ నుండి అవసరమైన లైసెన్స్ పొందకుండానే నిర్వాహకులు మద్యాన్ని అందించారు. మొత్తం 10.5 లీటర్లు కలిగిన ఏడు అనధికార విదేశీ మద్యం బాటిళ్లను, 10 భారత తయారీ మద్యం బాటిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
డ్రగ్స్ వినియోగంపై అనుమానం వచ్చిన పోలీసులు డ్రగ్స్ డిటెక్షన్ కిట్‌లతో హాజరైన పురుషులకు పరీక్షలు నిర్వహించారు. వీరిలో విజయ్ మద్దూరి అనే వ్యక్తి కొకైన్‌కు పాజిటివ్‌గా తేలింది. స్నిఫర్ డాగ్ సహాయంతో ప్రాంగణంలో క్షుణ్ణంగా శోధించగా, ఫామ్‌హౌస్ రాజ్ పాకాల చెందిందని పోలీస్ లు తెలిపారు. మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.
https://x.com/TeamCongressINC/status/1850410998110241060?t=KGdFFVvw2OoEcNHRUWkDSw&s=19