శేరిలింగంపల్లి,( చందానగర్ ), జూన్ 22 : చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం హత్య కేసు నమోదయింది. పోలీసుల వివరాలకు ప్రకారం.. మధ్యాహ్నం డయల్ 100 కాల్ వచ్చింది. చందానగర్‌లోని హుడా కాలనీ సాయిబాబా గుడి పక్కన ఉన్న ఓపెన్ ల్యాండ్‌లో ఒక మహిళ గుర్తు తెలియని మృతదేహం కనుగొనబడింది అని పోలీస్ లు తెలిపారు. సుమారు 40-45 సంవత్సరాల వయస్సు గల మహిళ మృతదేహాన్ని కనుగొన్నరు. ఆమె యష్ కలర్ లైనింగ్‌తో కూడిన సిల్వర్ కలర్ సింబల్స్ ప్రింట్ ఉన్న బ్లాక్ కలర్ చీర, బ్లాక్ కలర్ జాకెట్ & లైట్ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ మరియు మెడపై గుండ్రంగా ఉన్న రెడ్ కలర్ స్కార్ఫ్ ధరించింది ఉందని తెలిపారు.
ఆమె ఎడమచేతిపై బాలయ్య అనే టాటో ఉంది, మృత దేహాన్ని గమనించిన తర్వాత ఆమె గొంతు నులిమి హత్య చేసి ఉండవచ్చు అని పోలీస్ లు అనుమానస్పదం వ్యక్తం చేశారు. హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఆమె వివరాలు ఇంకా తెలియరాలేదని, ఆమె గురించి ఎవరికైనా తెలిస్తే చందానగర్ పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని పేర్కొన్నారు.
సెల్-8008029073 – 9490617118.