*జూన్ 1 వరకు ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విధిస్తున్నట్లు ఈసీ ప్రకటించింది.
*2024 లోకసభ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులోకి వచ్చినప్పటి నుంచి రూ.320 కోట్లు సీజ్.
హైదరాబాద్, మే 11 : 2024 సార్వత్రిక ఎన్నికల అన్ని దశలు జూన్ 1వ తేదీ సాయంత్రం 6:30 గంటల వరకు జరగనున్నాయి. కాబట్టి అప్పటివరకు అన్ని బల్క్ ఎస్‌ఎంఎస్‌లు, ఎగ్జిట్ పోల్స్‌లపై నిషేధం విధిస్తున్నట్లు ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ప్రకటించారు. శనివారం బీఆర్‌కే భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత లోక్‌సభ సెగ్మెంట్లలో మే 13న పోలింగ్ ముగిసే వరకు స్థానికేతరులు ఎవరు నివసించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. పోలింగ్ రోజున తమ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వలని లేదంటే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మే 12, 13 తేదీల్లో ఎలక్ట్రానిక్, వెబ్ మీడియా సంస్థల్లో రాజకీయ ప్రకటనలకు అనుమతి లేదని, ఎన్నికల సంఘం నుంచి ముందస్తు అనుమతితో మాత్రమే వార్తాపత్రికల్లో ప్రకటనలు ఇవ్వవచ్చని ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 3,509 పోలింగ్ బూత్‌లు ఉన్నాయని, మే 13న ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుందని తెలిపారు. 87 వేలకు పైగా బ్యాలెట్ యూనిట్లను వినియోగిస్తున్నామని, 20 వేల యూనిట్లను విడివిడిగా అందుబాటులో ఉంచామన్నారు. పోలింగ్ రోజు 164 కేంద్ర బలగాలతో పాటు మొత్తం 73,414 మంది సివిల్ పోలీసు సిబ్బంది, 500 మంది తెలంగాణ ప్రత్యేక పోలీసు బలగాలు, దాదాపు 90 వేల మంది అధికారులు హాజరావుతారని వికాస్ రాజ్ అన్నారు. 2024 లోకసభ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులోకి వచ్చినప్పటి నుంచి రూ.320 కోట్లు సీజ్ చేశామని, డ్రగ్స్ రవాణాకు సంబంధించి 200కు పైగా కేసులు నమోదు చేశామన్నారు.