శేరిలింగంపల్లి, మే 10 : లింగ వివక్షత, కులతత్వం 1200 వ శతాబ్దాలలో పోరాడిన గొప్ప వ్యక్తి మహత్మా బసవేశ్వరుడు అని శేరిలింగంపల్లి వీరశైవ లింగాయత్ సభ్యుడు, తెలంగాణ హకీ చైర్మెన్ కొండ విజయ్ కుమార్ తెలిపారు. మహత్మా బసవేశ్వరుడి 890 జయంతి కార్యక్రమంను కొండ విజయ్ ఆద్వర్యంలో చందానగర్ హుడాకాలనీ లో నిర్వహించారు. ఈ సందర్బంగా కొండ విజయ్ మాట్లాడుతూ మహత్మా బసవేశ్వరుడి అడుగుజాడల్లో ప్రతి ఓక్కరు నడుచుకోవాలని సూచించారు. స్వర్గం ఏక్కడో లేదని మానవుడు తాను చేసే పనిలో ఉంటుందని సమాజం పెద్దలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు మహిళలకు చీరలను అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీరశైవ లింగాయత్ సమాజం సభ్యులు రెవెన్యూ అసోసియేషన్ రాష్ర్చ మాజీ ఆద్యక్షుడు శివశంకర్ , మల్లిఖార్దున శర్మ, శివకుమార్, రవి అప్ప, ఉమేశ్, మల్లి ఖార్జున్, మధు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.